సీపీఐ(ఎం. ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కమిటీ సభ్యులు పిట్ల రామకృష్ణ
సిరికొండ, బతుకమ్మ : ఎన్నికల్లో ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై మంత్రివర్గం దృష్టి సారించాలని,హామీల అమలును విస్మరిస్తే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని సీపీఐ(ఎం. ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కమిటీ సభ్యులు పిట్ల రామకృష్ణ హెచ్చరించారు. శుక్రవారం సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో సీపీఐ (ఎం. ఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రాష్ట్ర క్యాబినెట్ రేపు సమావేశం కానున్నందున మంత్రివర్గం హామీలను అమలు చేయడంపై ద్రుష్టి పెట్టాలని ఇచ్చిన మాట నిలుపికోవాలని అయన కోరారు. రెండు పంటలు ముగిసిన కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడంలో మీన వేషాలు లెక్కిస్తుందన్నారు. రైతన్నకి పెట్టుబడి సాయంగా ఇస్తున్న డబ్బులు లేక రైతులు అప్పుల పాలవుతున్నారని, కాబట్టి ప్రభుత్వం రైతు బరోసా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదింటి కల నెరవేరేస్తామని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన ఇప్పటికి ఎక్కడ అమలుకు పూనుకున్నది లేదన్నారు. సర్వే పేరుతో కాలయాపన చేస్తుందని,వ్యవసాయకులకు భృతి కింద రూ.12వేలు సంవత్సరంకు వేస్తా అని ఇంకా అమలు చేయడం లేదన్నారు. చాలా కాలంగా రేషన్ కార్డులు లేక ప్రజలు ఇబ్బందులకు గురైతున్నారని వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలి అని ఆయన కోరారు. రేషన్ షాప్ ల ద్వారా సన్నబియ్యం అందిస్తాం అని ఇంకా ఇవ్వడం లేదు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, వ్యవసాయకూలీలకు 12వేల భృతి, రేషన్ కార్డులను వెంటనే ఇవ్వాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. పేస్ మీట్ లో సీపీఐ (ఎం.ఎల్ ) మాస్ లైన్ (ప్రజాపంథా) ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్.దామోదర్, మండల నాయకులు ఈ.రమేష్, ఎస్.కిషోర్, అనిస్, కట్ట. రాములు తదితరులు పాల్గొన్నారు.