29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

హెల్త్ టూరిజం హబ్ గా తెలంగాణ

Must read

📰 Generate e-Paper Clip

ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలి

సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రం హెల్త్ టూరిజం హబ్ గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఏర్పాటు చేసింది ఏఐజీ ఆస్పత్రిని సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కార మిచ్చి గౌరవిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. హెల్త్ టూరిజం లో సహకరించాలని నాగేశ్వర్ రెడ్డిని కోరారు. క్యాన్సర్ చికిత్సలో నూరి దత్తాత్రేయ సలహాలు సూచనలు తీసుకుంటున్నామన్నారు. ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు సామాజిక బాధ్యతగా ఏడాదిలో ఒక్క నెల రోజులు ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేయాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశంలో తయారయ్యే బల్క్ డ్రగ్ లో 35 శాతం హైదరాబాద్ లోనే ఉత్పత్తి అవుతుందన్నారు. దాదాపు 66 దేశాల నుంచి వచ్చే రోగులకు వైద్య సేవలు అందించే స్థాయికి ఏఐజీ చేరుకోవడం మనకు గర్వకారణం అన్నారు.

More articles

Latest article