వేల్పూర్, బతుకమ్మ : గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి ఇస్తామన్న పెన్షన్ లను వెంటనే పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్, విపీహెచ్ ఎస్, సీపీహేచ్పీ ఎస్ ల ఆధ్వర్యంలో సోమవారం వేల్పూర్ మండల తహసీల్దార్ ఆఫీస్ ను ముట్టడించారు. ఎమ్మార్పీఎస్ నేత,పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ముట్టడిలో భాగంగా ఆఫీస్ ముందు బైఠయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత వికలాంగుల,వృద్ధాప్య బీడీ కార్మికులకు పింఛన్లు కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతామని గత ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది.కానీ ఇప్పటివరకు ఆ హామీ అమలు చేయడం లేదంటూ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలని తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్య్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు తెడ్డు శివరాజ్,వర్కింగ్ ప్రెసిడెంట్ భక్కొల్ల ప్రశాంత్, అధికార ప్రతినిధి కేశపురం సుమన్,టీ బన్నీ,డి సుమన్, రమేష్, అఖిలేష్. విహెచ్ పీఎస్ నాయకులు బీడీ కార్మికులు కార్యకర్తలు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
