పెన్షన్ల పెంపు కోసం తహసీల్దార్ ఆఫీస్ ముట్టడి
వేల్పూర్, బతుకమ్మ : గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి ఇస్తామన్న పెన్షన్ లను వెంటనే పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్, విపీహెచ్ ఎస్, సీపీహేచ్పీ ఎస్ ల ఆధ్వర్యంలో సోమవారం వేల్పూర్ మండల తహసీల్దార్ ఆఫీస్ ను ముట్టడించారు. ఎమ్మార్పీఎస్ నేత,పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ముట్టడిలో భాగంగా ఆఫీస్ ముందు బైఠయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత వికలాంగుల,వృద్ధాప్య బీడీ కార్మికులకు పింఛన్లు కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతామని గత ఎన్నికల్లో హామీ...