30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

వరద ముప్పు రైతుల సమస్యలపై కలెక్టర్‌కు బిజెపి వినతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్: నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బోధన్ నియోజకవర్గంలోని హంగర్, కోపర్గా, మందర్న, హున్సా, ఖాజాపూర్ గ్రామాల వరద ప్రభావిత రైతుల సమస్యలపై మెమోరాండం అందజేశారు. రైతుల పంట నష్టానికి ఎకరాకు రూ.30,000 పరిహారం చెల్లించాలని, అలాగే వారి ఇండ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వ సాయం అందించాలని కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు కూరెళ్ళ శ్రీధర్, బోధన్ పట్టణ అధ్యక్షుడు పసుపులేటి గోపీ కిషన్, రూరల్ అధ్యక్షుడు సిర్ప సుదర్శన్, సాలూరు మండల అధ్యక్షుడు రావుబా గంగాధర్, రెంజల్ మండల అధ్యక్షుడు యోగేష్, అలాగే మనోహర్, ప్రవీణ్, రాజేందర్ గౌడ్, ఎనుగంటి గౌతం, బిల్లా విజయ్, కస్ప లింగం, సాగర్ గౌడ్, శివ, వరద ముప్పు గ్రామాల రైతులు, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

BJP appeals to Collector on flood threat, farmers' problems

More articles

Latest article