. . . సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎస్ ఐ
మద్నూర్, బతుకమ్మ :
మద్నూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ ప్రజల స్వచ్ఛంద సహాకారంతో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఏర్పాటు చేసిన 8 అత్యాధునిక సీసీ కెమెరాలను మద్నూర్ ఎస్ ఐ ఏ.మోహన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ నేరాల నియంత్రణ, ప్రజల భద్రతను బలోపేతం చేయడంలో సీసీ కెమెరాలు అత్యంత సమర్థవంతమైన ఆయుధాలని తెలిపారు. ఏదైనా నేరం జరిగినప్పుడు నేరగాళ్లను పట్టుకోవడంలో ఇవి ఎంతో సహాయపడతాయని వారు పేర్కొన్నారు. జిల్లా లోని ప్రతి గ్రామం సీసీ నిఘా నీడలోకి రావాలని, తద్వారా పటిష్టమైన భద్రతా వలయాన్ని నిర్మించవచ్చని ఆయప పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ పోలీస్ సిబ్బంది, మద్నూర్ గ్రామ సర్పంచ్ ఉష సంతోష్, పంచాయతీ పాలకవర్గం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
