29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

డీసీసీ జనరల్ సెక్రటరీకి ఘనంగా సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

 

కమ్మర్ పల్లి, బతుకమ్మ :

 

కమ్మర్ పల్లి మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన పోడెండ్ల సంజీవ్ యాదవ్ డీసీసీ జనరల్ సెక్రటరీ గా నియమితులయ్యారు. గురువారం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించిన డీసీసీ కమిటీలో సంజీవ్ యాదవ్ కి అవకాశం దక్కింది. ఈ సందర్బంగా వివిధ గ్రామాల సర్పంచ్ లు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని, కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. నియామకానికి సహకరించిన బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్, వేణు గోపాల్ యాదవ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైడి మధులత శ్రీనివాస్, సర్పంచ్ లు లతరాములు, నీలవేణి దశరత్, మంజుల దేవెందర్, ఉపసర్పంచ్ అనిల్, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు భూమారెడ్డి, భూమేష్, వెంకటి గణేష్, శేఖర్, రాకేష్, ఎర్రన్న, గంగాధర్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

More articles

Latest article