- సిఈఓను కాదని మేనేజర్లను బదిలీ చేసిన చైర్మెన్
- పాలకవర్గానికి సమాచారం లేకుండానే ఉద్యోగుల బదిలీలా..?
- మేనేజర్ల నుంచి ఆప్షన్ అడగకుండానే బదిలీలు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ శాఖల మేనేజర్లు బదిలీ అయ్యారు. ఈ నెల 20న తెల్లవారేసరికి 14 మంది మేనేజర్లను బదిలీ చేశారు. 21న తమకు బదిలీ చేశారు అని తెలిసి మేనేజర్లె షాక్ కు గురయ్యారు. ఎందుకంటే సిసిబి మేనేజర్లకు మేయిల్ ద్వారా ట్రాన్స్ ఫర్ ల సమాచారం రావడమే అందుకు కారణం. బ్యాంకు ఉద్యోగుల నియమ నిబంధనల ప్రకారం ఉద్యోగుల బదిలీకి వారిని మూడు ఆఫ్షన్ లను అడుగాల్సి ఉంటుంది. వారు ఇచ్చిన ఆప్షన్ బట్టి అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా బదిలీ చేయాలి. కాని రెండేళ్ల తరువాత ఒక్కటే రోజు 14 మంది సిసిబి మేనేజర్ లను బదిలీ చేసి నియమ నిబంధనలు తుంగలో తొక్కడంతో మేనేజర్ లు తలలు పట్టుకుంటున్నారు.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ కు అనుబంధంగా 63 శాఖ బ్యాంకులు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 60 నుంచి 70 మంది పని చేస్తున్నారు. మేనేజర్ లుగా వివిధ అనుబంధ శాఖలలో వారు పనిచేస్తున్నారు. గతంలో డిసిసిబి చైర్మెన్ గా పనిచేసిన పోచారం భాస్కర్ రెడ్డి హయాంలో చివరి సారిగా భారీగా సిసిబి మేనేజర్ ల బదిలీ జరిగింది. మళ్లీ ఈ నెల 21న బ్యాంక్ మేనేజర్ లను బదిలీ చేశారు. 14 మందిని బదిలీ చేస్తే కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే బ్యాంక్ ఉన్నతాధికారులు బదిలీ చేయాల్సిన మేనేజర్ లను పాలకవర్గం జోక్యం చేసుకోవడంపై ఆరోపణలు ఉన్నాయి. ఇది వరకే బ్యాంక్ ఉద్యోగుల యూనియన్ లో జోక్యం చేసుకోవడమే కాకుండా ఇప్పుడు అధికారులను పాలకవర్గంకు సంబంధం లేకుండా ట్రాన్స్ ఫర్ లు చేయడం ఏమిటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో జరిగిన సిసిబి మేనేజర్ ల బదిలీలు అడప దడప జరుగుతుండగా స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ప్రతినిధుల సిఫారసులతో జరిపారు. ఆనాడు కూడా ఏనాడు బ్యాంక్ సిఇఓకు ఇతర అధికారులకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రస్తుతం జరిగిన బదిలీలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన పరస్పర బదిలీల మాదిరిగా జరుపడం గమనార్హం. ఇదిలా ఉండగా కొందరు మేనేజర్ లు దూర బారం, వయో బారం తో పాటు ఆరోగ్య సమస్యలను పరిగణలోకి తీసుకోని బదిలీలు చేయాలని చాల సార్లు అధికారుల చూట్టు, చైర్మెన్ ల చుట్టు చక్కర్లు కోట్టారు కాని ప్రయోజనం లేకపోయింది. బ్యాంక్ ఉద్యోగుల నియమ నిబంధనల ప్రకారం మేనేజర్ లు ఐనా ఇతర ఉద్యోగుల బదిలీలు సిఇఓ చేయాల్సి ఉండగా సంబంధం లేకుండా ట్రాన్స ఫర్ లు చేస్తుండటంతో ఉద్యోగులు లబోదిబో మంటున్నారు. ఉద్యోగులను రాజకీయంగా వాడుకోవడానికి, తమకు నచ్చిన వారికి, సామాజికంగా తమ వారికి ప్రాధాన్యత ఇస్తు అప్రాధాన్యత ప్రాంతాలకు బదిలీలు చేశారని మరికొందరు వాపోతున్నారు. ఈ విషయంపై అధికారులను సంప్రదిస్తే తాము నిమిత్త మాత్రులం పాలక వర్గంకు సంప్రదించాలని చేతులు దులుపుకుంటున్నారు. పాలకవర్గంను ఈ విషయంపై అడిగితే తమకు సమాచారం లేదని చైర్మెన్ ను అడుగాలని కోరడంతో మేనేజర్ లు లబోదిబొ మంటున్నారు. తమ గోడు ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియక సతమత మౌతున్నారు.
