29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆరుగురు ఐఏఎస్ లకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్ లకు  సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆరుగురిని తెలంగాణా కేడర్ కు కేటాయించినట్లు తెలిసింది. ముస్సోరీలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎన్.ఉమా హారతిని సంగారెడ్డి జిల్లా నారయణ్ ఖేడ్ సబ్ కలెక్టర్ గా నియమించారు. అజ్మేర్ సంకేత్ కుమార్ ను నిర్మల్ జిల్లా భైంసా సబ్ కలెక్టర్ గా, అభిగ్యాన్ మాలవ్యను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సబ్ కలెక్టర్ గా, అజయ్ యాదవ్ ను ఖమ్మం జిల్లా కల్లూర్, మ్రునాల్ శ్రేష్టను భద్రాది కొత్త గూడెం జిల్లా భద్రాచలం సబ్ కలెక్టర్ గా, మనోజ్ ను మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ గా నియమించారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ కు తొలి సారిగా సబ్ కలెక్టర్ ను నియమించడం గమనార్హం.

More articles

Latest article