26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 67 వేల కోట్ల వడ్డీలేని రుణాలు

 

. . . మహిళా స్వశక్తికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకం

 

. . .  మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

 

. . . పవన్ కల్యాణ్ మాటల్లో అహంకారం కనిపిస్తోంది

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

మహిళలు స్వయంసహాయకులుగా ఎదిగేందుకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు వెళ్తున్నామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి అన్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో మెప్మా సౌజన్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా డివిజన్ నంబర్ 3 గూపన్ పల్లిలో బుధవారం ఏర్పాటు చేసిన ఉచిత చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ మహిళలు స్వతంత్రంగా తమ కాళ్ల పై తాము నిలబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో కాంగ్రేస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగానే వడ్డీలేని ఋణాలు, వ్యాపార నిమిత్తం స్త్రీనిధి ఋణాలు అందించడం జరుగుతుందన్నారు. మహిళామణులు స్వయంగా తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ కల్పిస్తూ.. శిల్పారంలో ప్రత్యేకకంగా స్టాళ్లు కేటాయించడం జరిగిందన్నారు. గూపన్ పల్లి అభివృద్ధికి పార్టీలకి అతీతంగా తనవంతు కృషి ఎల్లపుడు ఉంటుందని తెలిపారు. తనకు కూడా ఇక్కడి నుండే ఓటుహక్కు ఉందని గుర్తుచేశారు.

.  .  .  పవన్ కల్యాణ్ మాటల్లో అహంకారం కనిపిస్తోంది

ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పై ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఏమైనా పాకిస్తాన్ లో ఉందా అన్న పవన్ కళ్యాణ్ మాటల్లో అహంకారం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రతి పౌరుడికి దేశంలో ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉందని .. పవన్ కళ్యాణ్ ఎక్కడ తిరిగినా.. ఎక్కడి నుండి పోటీ చేసిన తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ తెలంగాణ పట్ల అనుచితంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోన్ నివసిస్తున్నారని,అలాంటిది తెలంగాణపై మాట్లాడడం సబబు కాదన్నారు. ఈ  కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవ్ రెడ్డి, ఉమ్మాజి నరేష్, హన్మండ్లు, తరుణ్, అంబర్ సింగ్, స్థానిక కార్పొరేటర్ ప్రసూన, మెప్మా డీఎంసీ మాధురి లత, టీఎంసీ శోభారాణి, స్త్రీనిధి ఆర్ఎం రాందాస్, మేనేజర్ సుగుణ, సీవో అర్చన, స్త్రీనిధి,మహిళా సమాఖ్య సంఘం సభ్యులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

State government working to make one crore women millionaires

 

More articles

Latest article