25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

సీఎం ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

లింగంపేట్, బతుకమ్మ :

లింగంపేట్ మండలం లింగంపల్లి గ్రామ సమీపంలోని పాములవాగు వంతెన వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్మోహన్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషి వల్ల లింగంపల్లి ఖుర్ద్ అడివిలింగాల్ హై లెవల్ బ్రిడ్జ్ పునర్నిర్మాణానికి 8.50 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయినట్లు వెల్లడించారు. ఈ సందర్బంగా లింగంపేట్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాయిరాం యాదవ్ ఆధ్వర్యంలో మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావుల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సాయిరాం యాదవ్ మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాల వల్ల బ్రిడ్జ్ వంతెన తెగిపోవడం జరిగిందని, మాట ఇచ్చిన విధంగా వంతెనకు ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. అందుకు గాను వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచులు వివిధ గ్రామాల అధ్యక్షులు, చైర్మన్లు, డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

More articles

Latest article