వెబ్ న్యూస్, బతుకమ్మ: పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ సోలార్ సౌండ్ బాక్స్ ను లాంచ్ చేసింది. ఇండియాలో మెట్టమొదటిసారిగా సౌరశక్తితో నడిచే సౌండ్ బాక్స్ ను తీసుకొచ్చింది. తక్కువ సూర్యకాంతితో ఛార్జ్ అయ్యేలా, వ్యాపారులకు విద్యుత్ ఖర్చుల్ని తగ్గించేందుకు వీటిని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. సోలార్ సౌండ్ బాక్స్ ల పైభాగంలో సోలార్ ప్యానెల్ ను కలిగి ఉంటాయి. ఈబాక్స్ ను సూర్యకాంతి తగిలేలా ఉంచితే ఆటోమెటిక్ గా ఛార్జ్ అవుతుంది. డ్యూయల్ బ్యాటరీతో దీన్ని తీసుకొచ్చారు. ఒకటి సౌరశక్తి, మరొకటి కరెంట్తో ఛార్జ్ చేయొచ్చు. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు వస్తుంది. 4జీ కనెక్టివిటీకి సపోర్టు చేసే ఈసౌండ్ బాక్స్ 3w స్పీకర్ తో వస్తోంది.11 భాషల్లో ఆడియో నోటిఫికేషన్ కు సపోర్టు చేసేలా రూపొందించారు.
