ఎల్లారెడ్డి, బతుకమ్మ: మండల కేంద్రంలోని డిప్యూటీ డీఎంఎచ్ వో కార్యాలయంలో కంటి పరీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థులకు శుక్రవారం వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ తదితర విద్యాసంస్థల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని వైద్యుడు హరికిషన్ తెలిపారు. ఈ అవకాశాన్ని కంటి చూపు సమస్యలతో బాధ పడే వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
