26.2 C
Hyderabad

భూపతి రెడ్డి . . . ఎవరి చెవిలో పూలు పెడుతున్నావు

Bhupathi Reddy... who are you trying to fool?

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిన్న విడుదలైన నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులే

. . .  నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి

 నిజామాబాద్, బతుకమ్మ:

 

రాష్ట్రం ద్వారా బిల్లులు విడుదల చేసి, కేంద్ర ప్రభుత్వానికి బిల్లులు రైజ్ చేసిన 48 నుంచి 72 గంటల్లో కేంద్రం నుంచి నిధులు విడుదల అవుతాయి. నిన్న విడుదలైన రూ.14.77 కోట్లలో రూ.13.65 కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులేనని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఎవరి చేవిలో పువ్వులు పెడుతున్నావు  అని నిజామాబాద్ ఎంపి అర్వింద్ ధర్మపురి విమర్శించారు. ఈ మేరకు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి రైల్వే ఓవర్ బ్రిడ్జీలకు నిధులపై విడదల చేసిన ప్రకటనను ఎంపి అర్వింద్ ఖండించారు. ఈ మేరకు ఓ ప్రకటనలో తాను నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆర్ ఓబి బిల్లుల విడుదల కోసం రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలను పలుమార్లు నేను కోరానని గుర్తు చేశారు.మాదవ్ నగర్ ఆర్ఓబి విషయంలో రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అదనపు నిధులకు పరిపాలనా అనుమతులు ఎవరు ఇప్పించాలి ? భూపతిరెడ్డి ఇప్పిస్తావా?లేదా?అనుమతులు రాకపోతే ఆర్ ఓబి రెండో వైపు కాంట్రాక్టర్ పనులు కొనసాగించే పరిస్థితి లేదన్నారు. ప్రజలకు అవసరమైన ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.కేంద్రం నుంచి నిధులు ఎలా తీసుకురావాలో మాకు తెలుసు. మాకు సలహాలు అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని రాష్ట్ర ప్రభుత్వం చేయాలి రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పరిపాలనా అనుమతులను వెంటనే ఇప్పించాలి. అనుమతులు ఇవ్వకపోతే త్వరలోనే పెద్ద ఎత్తున పోరుబాట చేపడతాం. మాధవ్ నగర్ ఆర్ ఓబి పూర్తయ్యే వరకు పోరాటం కొనసాగిస్తాం అని ఎంపి ప్రకటనలో తెలిపారు.

More articles

Latest article