. . . ధర్మపురి హిల్స్ లో రౌడిల అరాచకం
. . . ఫిర్యాదుదారు ఇంటి వద్ద బీభత్సం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని ధర్మపురి హిల్స్ లో రౌడిమూకలు రెచ్చిపోయాయి. ఈ నెల 28న పోలీసు ప్రజావాణిలో తమపై ఫిర్యాదు చేశారని కోపంతో రౌడిలు రెచ్చిపోయారు. మంగళవారం రాత్రి ధర్మపురి హిల్స్ లో ఫిర్యాదుదారుడి ఇంటిపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఇంటి ముందు నిలిపి ఉంచిన కారుపై రాళ్లువేసి ధ్వంసం చేశారు. నగరంలోని ధర్మపురి హిల్స్ కు చెందిన నోమాన్ మొబైల్ షాప్ నిర్వాహకుడిని కొందరు బెదిరించారు. తమకు కొత్త ఫోన్ ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డారు. దానితో బాధితులు పోలీస ప్రజావాణోలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్థానిక 6వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మంగళవారం రాత్రి తమపై ఫిర్యాదు చేయడానికి జీర్ణించుకోలేని రౌడి మూక నోమాన్ ఇంటిపై దాడి చేసి బీభత్సం చేసింది. ఇంటి ముందు ఉన్న కారును సిమెంట్ ఇటుకలతో ధ్వంసం చేశారు. రౌడిషీటర్, అతని కుటుంబ సభ్యులు దాడిలో పాల్గొన్నట్లు బాధితులు ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
