28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సభ, సాంప్రదాయాలను తుంగలో తొక్కిన సర్కార్

Must read

📰 Generate e-Paper Clip

  • సభ బిజినెస్ మాట్లాకుండానే సభ వాయిదా విడ్డూరం
  • నియమ, నిబంధనలకు తిలోదకం
  • మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

హైద్రాబాద్, బతుకమ్మ : అసెంబ్లీ సమావేశం 11 గంటలకు ఉన్నదని చెప్పి సమాచారం ఇచ్చిన సమావేశం ఒక్క నిమిషం కూడా సమావేశం జరుపకుండా వాయిదా వెయ్యడం అసెంబ్లీ చరిత్రలో ఎప్పుడు జరగలేదని,ప్రభుత్వం అసెంబ్లీ సభ సాంప్రదాయాలను తుంగలో తొక్కరని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ అత్యంత ముఖ్యమైన కొన్ని విషయాలు మాట్లాడాల్సి ఉందని ప్రభుత్వం మంత్రి వర్గ సమావేశం పెట్టుకొని, అసెంబ్లీ ఉందని చెప్పి సమావేశం పెట్టిన ఎల్, ఏ మంత్రి ఇంకా కాబినేట్ మీటింగ్ అవ్వలేదని స్పీకర్ కు చెప్పడం, మంత్రి చెప్పగానే స్పీకర్ సమావేశంను వాయిదా వేయడం చాలా అవమానకరమని ఆయన అన్నారు. ఒక మాట సభ బిజినెస్ గురుంచి మాట్లాడకుండా ఒక్క నిమిషంలోనే వాయిదా వెయ్యడం అంటే సర్కార్ కు అసెంబ్లీ పై ఉన్న గౌరవం ఎంతో అట్లే తెలిసిపోతుందన్నారు . ఈపాటికే సర్కార్ వైఖరితో రాష్ట్ర గౌరవం మట్టిలో కలిసిందని, ఏడాది కాలం లోనే రాష్ట్రం అన్ని రంగాల్లో వెనక్కి వెళ్తోందాన్నారు.బీ.సి గణన, ఎస్సీ వర్గీకరణ లాంటి ముఖ్యమైన అంశాలు చర్చించాల్సి ఉండగా 10 గంటలకు కేబినేట్ మీటింగ్ పెట్టుకొని, 11 గంటలకే అసెంబ్లీ సమావేశం పెట్టడం అంటే గంటలోనే ఈ అత్యంత కీలకమైన అంశాలను గురించి చర్చ పూర్తి అవుతుందని ఎలా అనుకున్నారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అవసరమైతే ఒక్క రోజు కాబినెట్, మరో రోజు అసెంబ్లీ పెట్టాల్సి ఉండాల్సిందని, ఆలోచన లేకుండా సమావేశాలు పెట్టి అసెంబ్లీ సాంప్రదాయాలు, ప్రొసీజర్లను పక్కన బెట్టి  ఇష్టరీతినా వ్యవహారించడమంటే నియమ, నిబంధనలకు తిలోధకాలు ఇవ్వడమేనన్నారు . వీరి చేష్టల వల్ల తెలంగాణ పరువు ఎప్పుడో పోయిన అసెంబ్లీ పరువును కూడా పొగొట్టారని ఆయన ఏద్దేవా చేశారు.అసెంబ్లీ సమావేశం లో ఎల్. ఏ మిస్టర్ తప్ప ఒక్క మంత్రి కూడ లేరని, ఒకే నిమిషంలో ఒక్క మాట కూడా సభ్యులకు చెప్పకుండా అసెంబ్లీని వాయిదా వెయ్యడాన్ని బీయర్ఎస్ ఎల్.పీ తీవ్రంగా ఖండిస్తోందని ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

More articles

Latest article