ఆర్మూర్, బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు మందుల బాలు, సీనియర్ నాయకులు కలిగోట గంగాధర్, జిల్లా రైతు నాయకులు నూతల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సకల జనులకు ఆమోదయోగ్యమైన బడ్జెట్ అందించినందుకు ఆర్మూర్ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగమేనని గమనించాలని అన్నారు. ఈ దేశ ప్రధాని గత 11 సంవత్సరాలుగా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి బీదా మధ్యతరగతి ప్రజల కోసం వారి బాగు కోసం ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ అన్ని రాష్ట్రాలకు సరి సమానమైనటువంటి అభివృద్ధి చేసి చూపిస్తున్నారని తెలిపారు. ఆర్థిక మంత్రి సీతారామన్ ఈ దేశంలో ఉన్నటువంటి రైతులకు, భారీ పరిశ్రమల పెట్టుబడిదారులకు, చిన్న ,మధ్యతరగతి పరిశ్రమల పెట్టుబడిదారులకు, వ్యాపారస్తులకు, ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగస్తులకు మేలు జరిగే విధంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. భారతదేశం ఆర్థికంగా ఎంత బలంగా తయారవుతుందో ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయని తెలిపారు. ఈ కాంగ్రెస్ నాయకులు మాత్రం సిగ్గు లేకుండా ఇంకా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కంచేటి గంగాధర్, యామాద్రి భాస్కర్, నూతల శ్రీనివాస్ రెడ్డి, ఆకుల శీను, , జస్సు అనిల్, కలిగోట గంగాధర్,బ్యావత్ సాయికుమార్,పోల్కం వేణు, పాన్ శీను, బోట్ల విజయ్, కలిగుట ప్రశాంత్, ఉదయ్, శేషగిరి లింగం,మందుల వీరభద్రి, కుక్కునూరు లింగన్న, రాములు, మందుల పోశెట్టి, జల్లి దేవేందర్, అనేక్, మధు, దోండి ప్రకాష్, కృష్ణ గౌడ్, వివిధ మోర్చా నాయకులు బూత్ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.