. . . “స్పెషల్ బస్సుల”పేరుతో స్పేషల్ బాదుడు
. . . లబోదిబో మంటున్న ప్రయాణికులు
హైద్రాబాద్, బతుకమ్మ :
రాఖీ పండుగ సందర్భంగా వేలాది మంది ప్రయాణికులు ఇళ్లకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. అయితే స్పెషల్ బస్సుల పేరుతో అధిక వసూలు చేస్తూ ఆర్టీసీ అధికారులుసిబ్బంది ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్-వరంగల్ మార్గంలో సాధారణ ఛార్జీల కంటే ఎక్కువ రుసుము వసూలు చేస్తూ రాఖీ స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికులపై భారం మోపుతున్నారు.సాధారణ టికెట్‌కు అదనంగా వసూలు చేస్తూ బస్సుల గోల్డ్ లేదా స్పెషల్ బోర్డులు అతికించి అధిక రేట్లను విధించడం పట్ల ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పండుగ రద్దీని ప్రజల నుంచి అధనపు బాదుడుతో ఆర్టీసీ సద్వినియోగం చేసుకునే ఈ విధానాన్ని ఆపాలని, ప్రభుత్వమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మగవారికి రాఖీ గిఫ్ట్ ఇచ్చిన ఆర్టీసీ…
రాష్ట్రవ్యాప్తంగా 50 నుంచి 100 శాతం బస్సు ఛార్జీలను పెంచడంతో మగవారు లబోదిబో మంటున్నారు. మహలక్ష్మ పథకం క్రింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిగించిన ఆర్టిసీ మగవారి వద్ధ అధనపు వసూళ్లు చేయడంలో లబొదిబోమంటున్నారు. రాఖీ పండగ సందర్బంగా సోధరులకు రాఖీలు కట్టేందుకు వెళ్లే మహిళలకు ఉచితంగా ప్రయాణం కలిగించిన ప్రభుత్వం పురుషుల వద్ధ మాత్రం వారి టికేట్ చార్జీలను వసూలు చేయడంపై విమర్శలు వస్తున్నియి . కుడి చేతితో ఇచ్చిన విషయం ఎడమ చేతికి తెలియనివ్వవద్ధని అంటారు పెద్ధలు. కాని ఆర్టిసీ మాత్రం మహిళలకు పండగ స్పెషల్ అధనపు బస్సులు వేశామని చెబుతునే సోధరిల చేత రాఖీలు కట్టించుకునేందుకు ప్రయాణించే సోధరుల నుంచి ఈబాదుడు ఎమిటని వాపోతున్నారు. నల్గొండ టు మిర్యాలగూడ మామూలు సమయంలో బస్సు ఛార్జీ రూ.60.. రాఖీ పండుగ సందర్భంగా రూ.120కి పెంచారు. ఎల్బీ నగర్ నుంచి సూర్యాపేటకు రూ.200 ఉన్న బస్సు ఛార్జీ రూ.310కి పెంచగా, జేబీఎస్ టు కామారెడ్డి బస్సు ఛార్జీ రూ.240 నుండి రూ.340కి పెంచగడంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు..

