- ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత ఉపాధ్యాయుడు
బతుకమ్మ, పిట్లం : ప్రతి గవర్నమెంట్ కార్యాలయంలో చేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ విరమణ సర్వసాధారణమని పి ఆర్ టి యు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కుశాల్ పేర్కొన్నారు. 1985 సంవత్సరంలో స్పెషల్ టీచర్ గా ఉద్యోగం జీవితంలోకి ప్రవేశించి అంచలంచలుగా ఎదుగుతూ 40 సంవత్సరాల ఉద్యోగ జీవితం పూర్తి చేసుకుని ఈనెల లో ఉద్యోగ విరమణ పొందుతున్న ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు ఎన్.శంకర్ పిట్లం మండల శాఖ పక్షాన ముఖ్య అతిథులు పి ఆర్ టి యూ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు కుశాల్ చేతుల మీదుగా, పిట్లం మండల శాఖ అధ్యక్షులు పి బన్సీలాల్ ప్రధాన కార్యదర్శి,సి నారాయణ పిట్లం మండల రాష్ట్ర జిల్లా మండల కార్యవర్గ సభ్యులచే ఘనంగా సన్మానించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు కుశాల్ మాట్లాడుతూ శంకర్ యొక్క సేవలు అమోఘమైనవని కొనియాడుతూ సుదీర్ఘమైన 40 సంవత్సరాల ఉద్యోగ జీవితం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయడం జరిగింది.ఉద్యోగ విరవనంతర జీవితం ఇటు విద్యార్థులకు మరియు సామాజిక సేవ సంఘ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని సేవలు చేసే భాగ్యం కల్పించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు తెలంగాణ రాష్ట్ర పిట్లం శాఖ అధ్యక్షులు పి బన్సీలాల్ ,ప్రధాన కార్యదర్శి సి నారాయణ తోపాటు మండల విద్యాశాఖ అధికారి శ్రీదేవి సింగ్, మండల నోడల్ అధికారి బి రమణా రావు, పి ఆర్ టి యు తెలంగాణ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, మాణిక్ రావు, రవీందర్ జెట్టి , రాష్ట్ర ఉపాధ్యక్షులు కిష్టయ్య, బుజ్జయ్య, నగేష్, ప్రమోద్ కుమార్, మండల కార్యవర్గ సభ్యులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బంధు మిత్రులు పాల్గొన్నరు.
