బైక్ ను తప్పించబోయి అదుపు తప్పిన కారు

0 14,831
  • గాయాలు కాకుండా బయటపడ్డ ప్రభుత్వ టీచర్లు

 

లింగంపేట్, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లా లింగంపేట్ బురుగిద్ధ వద్ద ఎదురుగా వస్తున్న ఎక్సైల్ బైక్ ను తప్పించబోయి కారు అదుపు తప్పి చెట్ల పోదలలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం జరిగింది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన కొందరు ఉపాధ్యాయులు జుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో  టీచర్ లుగా పనిచేస్తున్నారు. సాయంత్రం విధులు ముగించుకొని కార్ లో కామారెడ్డి వెలుతుండగా బురుగిద్ధ వద్ద  షట్పల్లి గ్రామానికి చెందిన చంద్రప్ప అనే వ్యక్తి మోటార్ సైకిల్ పై ఎదురుగా వస్తుండగా దానిని ఢీ కొట్టారు. స్పీడ్ కంట్రోల్ చేయడంలో విఫలం చెంది కార్ పక్కకు ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఉపాద్యాయులు ఎవ్వరు గాయపడలేదు.

Leave A Reply

Your email address will not be published.