బతుకమ్మ భిక్కనూరు : భిక్కనూరు మండలంలో గల తిప్పాపూర్ గ్రామంలో లో సర్వే నంబర్ 563 సర్వే నంబర్ 491 లో అటవీశాఖ అధికారులు రెవెన్యూ అధికారులు బుధవారం జాయింట్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా రెవిన్యూ ఇన్స్పెక్టర్ బాలయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామంలో జాయింట్ సర్వే నిర్వహించడం జరిగిందని గ్రామంలోని 25 మందిని అర్హులుగా గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

