24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రజా సమస్యలే మన ఎన్నికల ఎజండా

Must read

📰 Generate e-Paper Clip

  • ఎన్నికలు విప్లవ పార్టీలకు  ఎత్తుగడ మాత్రమే
  • సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి. ప్రభాకర్

 

సిరికొండ, బతుకమ్మ : ప్రజాసమస్యలే ఎజెండగా ఎన్నికల్లో పాల్గొందామని, విప్లవ పార్టీలకు ఎన్నికలు కేవలం ఎత్తుగడ మాత్రమేనని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి. ప్రభాకర్  పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని రావుట్ల గ్రామంలో  సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ నిజామాబాద్ రూరల్,  కామారెడ్డి సంయుక్త జిల్లాకమిటీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు – పార్టీ వైఖరి అన్న అంశం పై అవగహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ భూర్జువ ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజాసమస్యల ఎత్తిపాడుతూ ఎన్నికలు ఒక ఎత్తుగడ ఉపయోగించుకోవాలి అని ఆయన అన్నారు. ఎన్నికల్లో సీపీఐ, సిపిఎం పార్టీలు ఎన్నికల్లో భూర్జువ పార్టీలతో ఎన్నికల పొత్తులను పెట్టుకొని ఎన్నికల దిగజారుడు రాజకీయాలను అవలంభించారన్నారు.వారిని రివిజనిజం పార్టీలుగా ప్రకటించి, వారిని కాదని ఎం. ఎల్ పార్టీగా వేరుగా మనం ఏర్పడ్డమన్నారు. సీట్లు,ఓట్లు గీటురాయిగా రివిజనిస్టు పనిచేస్తారని, విప్లవ పార్టీలుగా మనం భూర్జువ పార్టీలను తిరస్కరించాలన్నారు. విప్లవ పార్టీలు పోటీలో ఉన్నచోట్ల ఐక్యంగా,అవగహనతో ఎన్నికలల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. కాంగ్రెస్, టిఆర్ఎస్, బిజెపి  పార్టీలు డబ్బు సంచులు, మద్యం తో ఎన్నికల్లో మరోసారి తలపడుతున్నాయని,  ప్రజలు ఈ భూర్జువ పార్టీలను చిత్తుచేసి ప్రజల కోసం పనిచేసే సీపీఐ(ఎం.ఎల్.)మాస్ లైన్ (ప్రజాపంథా)నే గెల్పించి నీతి, నిజాయితీ నిలబెట్టాలని ఆయన కోరారు.  ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్.)మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పీ. రామకృష్ణ, జిల్లా నాయకులుబి. దేవరాం, ఎం. ముత్తేన్న, ఆర్. రమేష్, ఎస్. సురేష్, వి. సత్తేవ్వ, కె. రాజేశ్వర్, జి. కిషన్, డివిజన్ నాయకులు ఆర్. దామోదర్, బి.కిషన్, బి.కిషోర్, ఎం. నారగౌడ్, ఇ. రమేష్, ఏ.సాయన్న, ఎస్. కిశోర్, ఎం అనిస్, బి. సర్పంచ్, పీడీఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎం. నరేందర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎల్. అనిల్ కుమార్, ఎస్.దుర్గప్రసాద్ పీఓడబ్ల్యూ నాయకులు జి.పద్మ, జి.లక్ష్మి, ఎం. సునీత, జి.బాల్ రెడ్డి, వి. భూమాగౌడ్, జి ఎర్ర్రన్న, బి. సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article