27.3 C
Hyderabad

ఘనంగా కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు                

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం కాకా వెంకటస్వామి 96 వ జయంతి సందర్బంగా చిత్రపటానికి పూలమాలలు వేసి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి  నర్సయ్య మాట్లాడుతూ  కాకా వెంకటస్వామి గుడిసెల వెంకటస్వామిగా పేరు గడించడం జరిగిందన్నారు.ఇల్లు లేని నిరుపేదలకు గుడిసెలు వేయించి ప్రభుత్వం చేత పక్కా ఇల్లు కట్టించినటువంటి ఘనత ఆయనకే దక్కిందన్నారు. కేంద్రంలో మంత్రిగా పనిచేసే దివంగత మాజీ ప్రధాని  ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడుగా ఉండేవారన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం లో ఇప్పటికీ వారి కుటుంబానికి ప్రజలు పట్టం కట్టడం జరుగుతుందన్నారు.ఎంపీగా వంశీ మంత్రిగా వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యేగా వినోద్ ప్రజల మధ్య ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రామ్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్దిలక్ష్మారెడ్డి,జిల్లా కార్యదర్శి పందిర్ల లింగం గౌడ్, పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మెండే శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎడ్ల రాజ్ కుమార్, బండారి బాల్ రెడ్డి, నంది కిషన్, మహమ్మద్ రఫీక్, ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article