25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

 ప్రొటెక్షన్ భ(ర)క్షణ  కోసమే

Must read

📰 Generate e-Paper Clip

  • ఆమ్ధాని   పోస్టుల కోసం పైరవీలు
  •  ఇంకొందరు కంపౌండ్ దాటకుండా
  •  ట్రేడ్ యూనియన్ లలోనూ అంతే

నిజామాబాద్ బతుకమ్మ :  ఇంకొన్ని గంటలలో బదిలీల ఉత్తర్వులు వెలువడనున్న దృష్ట్యా మంతనాలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. పవర్ హౌస్ లో చేతికి చమురంటే పోస్టులపై  యూనియన్ నాయకులు కన్నేశారు. సంస్థను కాపాడేందుకని కాదు… వీరు చేసిన అక్రమ బాగోతాలు బయటపడకూడదని అసోసియేషన్ కు చెందినా…అందులోనూ ఖర్చుకు వెనుకాడని వారిని నియమించేందుకు అంతర్గతంగా చక్రం తిప్పుతున్నారని వినికిడి.

 ప్రొటెక్షన్ భక్షణ కోసమే..

నిజామాబాద్ సర్కిల్ కు సంబంధించి కీలకమైన పోస్టులు యూనియన్ నాయకుల కనుసన్నల్లోనే ఉంటున్నాయి. తన అనునాయులకు అనుకూలమైన పోస్టింగ్ ఇప్పిస్తే సంఘంలో ఖర్చులు భరిస్తారనే కాకుండా, ఆ సీటు నుంచి తప్పుకున్న వారి తప్పులు కనబడకుండా ఉంటాయని వారి ముందస్తు ఆలోచనలుగా కనబడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. పవర్ హౌస్ లో అత్యంత ముఖ్యమైన పోస్టు ఏదంటే స్టోర్ అని చెప్తుంటారు. ఉభయ జిల్లాలకు ఇక్కడి నుంచే పరికరాలను  పంపిస్తుంటారు. పనిచేసిన ప్రాంతంలో తొలగించినవి తిరిగి స్టోర్ కు  అప్పగించాల్సి ఉంటుంది.  ఇందులోనూ చేతివాటం అనే దానికన్నా డిమాండ్ వాటంగా కంపౌండ్ లో అభివర్ణిస్తుంటారు. దీనివల్లే పోస్టు కోసం యూనియన్ నాయకులు వారి సహచరుల కోసం వెంపర్లాడుతున్నారని తెలుస్తోంది. సర్కిల్ కార్యాలయ పరిధిలో కప్పదూకినట్లుగా అందులోనే ఇంజనీర్లు తిరుగుతున్నారని ఆరోపణలు వినబడుతున్నాయి. ట్రేడ్ యూనియన్ నాయకులు సైతం ప్రొటెక్షన్ పేరిట కేంద్రంను దాటడం లేదు. పోస్టింగ్ తీసుకున్న నాటి నుంచి వేరే ప్రాంతానికి బదిలీ అయిన దాఖలలో కనిపించవు.

 కొందరికి రక్షణ..

ఇంకొందరు పవర్ హౌస్  కంపౌండ్ దాటకుండా ఉండేందుకు ప్రొటెక్షన్ ను తీసుకుంటున్నారు. వీరు ఆమ్దాని  కోసం కాకుండా స్థానికంగా ఉండీ, గప్పాలు కొట్టుకుంటూ నారద ముని పాత్రను పోషించేందుకు ఇష్టపడుతుంటారు. ఈ కోవాలో అపాయింట్మెంట్ నుంచి ఇప్పటివరకు అనగా 25 ఏళ్ల పైబడిన వారు ఒకే చోట ఉన్నారంటే వీరికి ప్రొటెక్షన్ ఎంతగా ఉందో గమనించవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులని, అసోసియేషన్, యూనియన్ అంటూ ప్రొటెక్షన్ తీసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వీరి దురాగత నిర్ణయ ఆలోచనల వల్ల మరొకరికి అవకాశం లేకుండా పోయిందనే వేదనలు కంపౌండ్ ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి.

సీఎండీ ఆదేశాల మేరకే..

కంపెనీ సీఎండి ఆదేశాల మేరకే నిబంధనలు పాటిస్తూ బదిలీలు చేపడతామని ఎస్ ఈ రవీందర్ తెలిపారు. జాబితాలో ముందుగా ఉన్న ఉద్యోగి ఆ పోస్టు కు న్యాయం చేస్తారా లేదా అని  చూస్తామన్నారు. ఉద్యోగులు పెట్టుకున్న ఆప్షన్ల ప్రకారమే బదిలీలు ఉంటాయని, పుకార్లను నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు.

More articles

Latest article