25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

దసరా, బతుకమ్మ పండుగలకు డీజే లను అనుమతించాలి

Must read

📰 Generate e-Paper Clip

  •  పీసీసీ అధ్యక్షుడి సూచనలతో సీపీ ని కోరిన మానాల మోహన్ రెడ్డి

నిజామాబాద్, బతుకమ్మ : దసరా,  బతుకమ్మ  పండగల సందర్భంగా డీజే లకు  అనుమతించాలని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సూచనతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు  మానాల  మోహన్ రెడ్డి పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ను కలిసి విన్నవించారు. జిల్లా డీజే అసోసియేషన్ సభ్యులు, హోటల్ యజనులు, వ్యాపారస్తులు కలిసి దసరా బతుకమ్మ పండుగ రోజున పోలీసులు డీజే కు అనుమతి ఇవ్వడం లేదని,వ్యాపారస్తులకు 10 గంటలకే దుకాణాలు బంద్ చేయడంతో కష్టంగా వుంది అని కావున ఈ సమస్యను పరిష్కరించే విధంగా చూడాలని మహేష్ కుమార్ గౌడ్ ని కోరారు.వెంటనే మహేష్ కుమార్ గౌడ్ సిపి కి ఫోన్ చేసి మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి కలిశారు. దసరా, బతుకమ్మ పండుగలు అయిపోయే వరకు హోటల్, వ్యాపారస్తులకు సమయం పెంచాలని కోరారు. సీపీ సానుకూలంగా స్పందించారని మానాల మోహన్ రెడ్డి తెలిపారు.   ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుద్దస్, నిజామాబాద్ జిల్లా డీజీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article