బాన్సువాడ, బతుకమ్మ :
మలిదశ తెలంగాణ ఉద్యమ కారుల ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా సోమవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ కు చెందిన మలి దశ ఉద్యమ కారులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఉడత గంగాధర్ మాట్లాడుతూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మేనిఫెస్టో లో ఉద్యమ కారులకు 250 గజాల స్థలం ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సాయం రూ.25000 పెన్షన్ ఉద్యమ కారుల గుర్తింపు కార్డు ఇచ్చి ఉద్యమ కారుల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆరు గ్యారంటీ కార్డులలో పొందు పరచడం జరిగింది. కానీ నేటికీ ఇందిరమ్మ రాజ్యం వచ్చి 27 నెలలు అయినా ఉద్యమ కారులపై ఇలాంటి హామీ ఇవ్వలేదు. ఇప్పటికయినా ఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరవేర్చాలని ప్రభుత్వానికి తెలియ చేయడం కోసం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం సమయంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విరమించడం జరిగింది. దీన్ని గమనించిన పోలీసులు పట్టణ ఉద్యమకారులను ముందస్తుగా అరెస్ట్ చేసి సొంత పూచి మీద వదిలి వేయడం జరిగింది. ఈ అరెస్టులో ఉడుత గంగాధర్ గుప్తా, గంజివార్ చందు, కాల్వ శ్యామ్, ఎదుబల్లి కృష్ణ, భాస్కర్ గౌడ్, అగ్లావే దత్తు, పల్లికొండ సాయికుమార్, గంగారామ్, ఉద్యమ కారులు పాల్గొన్నారు.