- ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
- భిక్కనూరు మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం
బతుకమ్మ భిక్కనూరు: పార్టీ కోసం పని చేసే ప్రతీ కార్యకర్తకు పదవులు దక్కుతాయని ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. భిక్కనూరు మార్కెట్ కమిటీ ఆవరణలో నిర్వహించిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో భాగంగా శనివారం చైర్మన్ పాతరాజు వైస్ చైర్మన్ గా పెద్దమల్లారెడ్డి టెంట్ హౌస్ స్వామి, నాలుగు మండలాలు చెందిన పలువురు డైరెక్టర్లుగా పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన షబ్బీర్ అలీ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టిన తట్టుకొని పార్టీలు మారకుండా పార్టీ అభివృద్ధి కోసం పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి ప్రజల ఆదరణతో అధికారంలోకి వచ్చామని అన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. రుణమాఫీ ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులు రైతులకు అండగా ఉండి వారి అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
మార్కెట్ కమిటీ అభివృద్ధికి పూర్తి సహకారం : ఎంపీ సురేష్ షెట్కర్
భిక్కనూరు మార్కెట్ కమిటీ అభివృద్ధికి తమ పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ భిక్కనూరు మార్కెట్ కమిటీ అభివృద్ధికి రైతుల సంక్షేమానికి తమ పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఇంద్రకరణ్ రెడ్డి చంద్రకాంత్ రెడ్డి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మార్కెటింగ్ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
