29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇక గ్రామాల్లో మంచినీటి సహాయకులు

Must read

📰 Generate e-Paper Clip

ప్రతి పంచాయతీ నుంచి చురుకైన వారిని ఎంపిక
నాలుగు అంశాల్లో శిక్షణ
బతుకమ్మ, మోర్తాడ్: గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం లో ఇక పై కొత్తగా గ్రామ మంచి నీటి సరఫరా సహాయకులు వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించి శాశ్వత పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అనడంలో అతిశయోక్తి లేదు. గ్రామాల్లో తాగునీటి వ్యవస్థపై ఎవరికి పూర్తిస్థాయిలో బాధ్యత లేని కారణంగా త్రాగునీటి సరఫరా విధానంను పూర్తిస్థాయిలో గాడిన పెట్టేందుకు కొత్తగా గ్రామీణ మంచినీటి సహాయకులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నది.
గ్రామ పంచాయితీల్లో మల్టీపర్పస్ వర్కర్లు గా పని చేస్తున్న వారిలో నుంచి పంచాయితీకి ఒకరు చొప్పున చురుకైన అభ్యర్థిని ఎంపిక చేసి వారిని ఇకపై గ్రామీణ మంచినీటి సహాయకులుగా నియమించనున్నారు.
జిల్లాలో 611 మంది ఎంపిక..
నిజామాబాద్ జిల్లాలో 530 గ్రామ పంచాయతీలకు గాను 611 మందిని గ్రామ మంచినీటి సహాయకులుగా ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తున్నారు. ప్రతి గ్రామ పంచాయితీకి ఒక్క గ్రామీణ మంచినీటి సహాయకులు గా ప్రభుత్వం ఎంపిక చేసింది. వారికి కీలకమైన నాలుగు అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ప్రతి రెండు లేదా మూడు మండలాలను ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసి ఆ క్లస్టర్లో పనిచేసే అసిస్టెంట్ ఇంజనీర్ ఆధ్వర్యంలో వీరు గ్రామీణ మంచినీటి నిర్వహణ పనులు చేపట్టనున్నారు. గ్రామీణ త్రాగునీటి సరఫరా విధానం అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో రానున్న దాన్ని గాడిన పెట్టే ఉద్దేశంతో ఈ కొత్త విధానం అమలు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
నాలుగు అంశాల్లో శిక్షణ..
గ్రామాల్లో ఉన్న తాగునీటి వ్యవస్థను సక్రమంగా నడిపించడానికి ఎటువంటి లోపాలు లేకుండా ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేసే విధంగా ప్రజలకు నీరు అందించే విధంగా నాలుగు అంశాల్లో గ్రామీణ మంచినీటి సహాయకులకు శిక్షణ ఇస్తున్నారు.
1) ప్లంబింగ్ పై శిక్షణ పైపులైన్ నుంచి ఇంట్రా విలేజ్ పైప్ లైన్ అనుసంధానం. 2)రెండోది వాటర్ క్వాలిటీ పై ట్యాంకుల్లో తాగునీటి క్లోరినేషన్ విధానం పై శిక్షణ. 3) వన్ హెచ్ పి, త్రీ పేజ్ మోటార్ రిపేర్ చేయడం.(ఎలక్ట్రికల్)
4)హ్యాండ్ పంప్(చేతి పంపు) నిర్వహణ, మరమ్మత్తులపై వీరికి శిక్షణ ఇస్తున్నారు.
గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా
రాకేష్ మిషన్ భగీరథ (ఈ ఈ) నిజామాబాద్
ప్రతి గ్రామ పంచాయతీ నుంచి చురుకైన వ్యక్తులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నాము. చేతి పంపు మరమ్మత్తులు, ప్లంబింగ్ పనులు, సింగిల్ ఫేస్/త్రీ ఫేస్, వాటర్ క్వాలిటీ వంటి అంశాలపై వారికి శిక్షణ ఇస్తున్నాము. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వీళ్ళు పరిష్కరించే విధంగా శిక్షణ అందిస్తున్నాం.

And fresh water helpers in the villages

More articles

Latest article