26.4 C
Hyderabad

సమాచారం ఇవ్వని ఈవో శ్రీధర్ పై పోలీస్ స్టేషన్ ఫిర్యాదు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు : సమాచార హక్కు చట్టం ద్వారా ఆలయ అభివృద్ధి పనుల పై సమాచారం ఇవ్వని సిద్ధ రామేశ్వర ఆలయ ఈవో శ్రీధర్ పై పోలీస్ స్టేషన్ లో ఆర్.టి.ఐ జిల్లా ప్రతినిధి రవీందర్ ఫిర్యాదు చేశారు. ఆర్టిఐ జిల్లా ప్రతినిధి రవీందర్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పై పలు వివరాలు ఇవ్వాలంటూ దరఖాస్తు చేశారు. ఈవో శ్రీధర్ లిఖితపూర్వకంగా ఎలాంటి గుడి వివరాలు ఇవ్వరాదని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చాడు. ఆర్టి ఐ జిల్లా ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ పరిధికి సంబంధించి ఏ కార్యాలయం సమాచారం ఐనా కోరవచ్చు అన్నారు. సమాచారం ఇవ్వని ఈవో శ్రీధర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో రాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article