24 C
Hyderabad
Sunday, August 2, 2026

పోక్సో కేసు నిందితునికి ఐదేళ్ల జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితునికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.2వేల జరిమాన విధించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లాలోని మహమ్మద్ నగర్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలిక తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్నారు. 2021 జనవరి 16న  వారు పని నిమిత్తం బయటకు వెళ్లారు. బాధితురాలు, బాధితురాలి చెల్లెలు,స్నేహితులతో ఆడుకుంటుంది. అదే గ్రామానికి చెందిన షేక్ షాదుల్ చెరుకు గడ్డ ఇస్తా అని చెప్పి బాధితురాలిని ఇంట్లోకి పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో భయపడిన బాధితురాలు కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తరువాత బాధితురాలు విషయాన్ని చెప్పింది. దీంతో వారు నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడు షేక్ షాదుల్ ను అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ సేషన్ జడ్జీ (పోక్సో) లాలాసింగ్ శ్రీనివాస్ నాయక్ నిందితుడు షక్ షాదుల్ కు గురువారం ఐదు సంవత్సరాల కఠని కారాగార శిక్ష, రూ.2వేల జరిమానా విధించారు. ఈ సందర్భంగా కోర్టు కానిస్టేబుల్ కిషన్, ప్రస్తుత సబ్ ఇన్స్పెక్టర్ జె.శివ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ ను జిల్లా ఎస్పీ అభినందించారు.

More articles

Latest article