26.4 C
Hyderabad

ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్ల పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుపకల్ గ్రామ శివారులో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొన్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు. భీమ్ గల్ పోలీసులు గురువారం ఉదయం 5.00 గంటల సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఇసుక లోడుతో వెళ్తున్న రెండు ట్రాక్టర్లను ఆపి ఇసుక రవాణా అనుమతి పత్రాలు అడగగా అనుమతి పత్రాలు లేకపోవడంతో ఆ ట్రాక్టర్లను   పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి నట్లు తెలిపారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న భీమ్ గల్ కు చెందిన సిర్సు రాములు, వేముల ప్రశాంత్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

More articles

Latest article