25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పీజీ ఫలితాలు విడుదల

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఫిబ్రవరి 2025 నిర్వహించిన పీజీ మొదటి, మూడో సెమిస్టర్ ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. ఈ ఫలితాలను తెయూ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కె.సంపత్ కుమార్, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డా.టి.సంపత్, గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.రాంమోహన్  రెడ్డి, కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి కె.భరత్ రాజ్, కళాశాల అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డా.యస్.జయప్రసాద్ విడుదల చేశారు. ఈ పరీక్ష ఫలితాలను కళాశాల వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు కళాశాల ప్రన్సిపాల్ తెలిపారు. మొదటి సెమిస్టర్ లో 68.65శాతం మంది విద్యార్థులు, మూడో సెమిస్టర్ లో 80.36శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.

More articles

Latest article