- అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగర పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అధికారులను ఆదేశించారు. నాందేవాడ, హమాల్ వాడి 35,36 డివిజన్లో మంగళవారం ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మున్సిపల్ కమిషన్ కి పలు సూచనలు చేశారు. నగరంలో డ్రైనేజీ సమస్య కీలకంగా మారిందని మున్సిపల్ సిబ్బంది నిత్యం డ్రైనేజీ పూడికలు తీయాలని అవసరం ఉన్న చోట డ్రైనేజీ కాలువలు పునః నిర్మాణం చేపట్టాలని ఇందూర్ కార్పొరేషన్ ను పారిశుధ్యంలో రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టే విదంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది బాధ్యతయుతంగా పని చేయాలన్నారు. నగరంలో వీధి ద్విపాలు కొరత

పెద్దమొత్తంలో ఉందని వీలైనంత త్వరగా నగరంలో వీధి ద్విపాలు ఏర్పాటు చేయాలని కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. నాందేవాడ, హమాల్ వాడి 35,36 డివిజన్లో ఉన్న పట్టణపకృతి వనాలు ఆధ్వణమైన స్థితిలో ఉన్నాయని వాటిని సుందరికరణ చేసి పార్క్ నిర్మాణం చేసి నగర వాసులకు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలని సూచించారు. నగర వాసులకు మౌలిక సౌకర్యాల కల్పనలో ఎటువంటి లోటుపట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ మురళి మోహన్ రెడ్డి, అడిషనల్ మున్సిపల్ కమీషనర్ జయకుమార్,డిప్యూటీ ఈఈ సుదర్శన్ రెడ్డి, షాజీద్ అలీ, ఏఈ పావని, కార్పొరేటర్స్ ఎర్రం సుధీర్, మాస్టర్ శంకర్, బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

