మోర్తాడ్, బతుకమ్మ : ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించడం వల్ల సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చని సూపర్వైజర్ ఆకుల మారుతి అన్నారు. మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ, ధర్మోరా గ్రామాల్లో ఆయన పర్యటించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విద్యార్థులు హ్యాండ్ వాష్ వ్యక్తిగత పరిశుభ్రత కు ఎటువంటి చర్యలు తీసుకోవాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం శెట్ పల్లీ, ధర్మోరా గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ దోమల యొక్క వ్యాప్తిని అరికట్టడానికి డ్రైడే యొక్క ప్రాముఖ్యతను స్థానికులకు వివరించడం జరిగింది. ఇందులో భాగంగా దోమల ఉన్నటువంటి నిలువ స్థలాలను తొలగించడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది సద్గుణ, దీప, లావణ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య, లక్ష్మణ్, ఆశ వర్కర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
