- డిస్ట్రిక్ట్ ఎన్ఎస్యుఐ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ రహమాన్
భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ పట్టణం తో పాటు పరిసర గ్రామాల్లో ఉన్న ఉన్న ప్రయివేట్ స్కూల్స్ యజమానులు అధిక ఫీజులు వసూలు చేయడం మానుకోవాలని డిస్ట్రిక్ట్ ఎన్ ఎస్ యు ఐ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ రహేమాన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రవేట్ పాఠశాలలో ఫీజులు తీసుకోవాలని, అందుకు భిన్నంగా కొన్ని ప్రైవేట్ పాఠశాలల యజమానులు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి స్కూల్ ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందన్నారు. అడ్మిషన్ ఫీజు,కంప్యూటర్ ల్యాబ్ ఫీజు, స్పోర్ట్స్ ఫీజు, లైబ్రరీ ఫీజు, బస్సు ఫీజులంటూ లేనిపోని ఫీజుల పేర్లు చెప్తూ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల జేబుకు చిల్లులు పొడుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను వివిధ రకాల ఫీజులతో ఏ పాఠశాల యాజమాన్యమైన వేధిస్తే ఎన్ ఎస్ యు ఐ నాయకులను సంప్రదించాలని ఆయన కోరారు. మండల్ ఎంఈవో, జిల్లా డీఈవో ఏదైనా ప్రైవేట్ పాఠశాల అధిక ఫీజులో వసూలు చేస్తుందని తల్లిదండ్రులు గాని, విద్యార్థి నాయకులు గానీ వచ్చి ఫిర్యాదు చేస్తే ఆ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకొని, పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సంపత్, భువన్,దీపక్ శశాంక్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
