27.5 C
Hyderabad
Friday, July 31, 2026

విద్యుత్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు సుదర్శన్ నాయక్

 

ఇందల్ వాయి, బతుకమ్మ :

 

ఇందల్ వాయి తాండ గ్రామవాసులు విద్యుత్ పట్ల నిర్లక్ష్యం వహించొద్దని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు సుదర్శన్ నాయక్ తెలిపారు. ఇందల్ వాయి తాండ గ్రామంలో బుధవారం సుదర్శన్ నాయక్ ఆధ్వర్యంలో ప్రజా బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ప్రమాదాలు సంభవించకుండా ఉందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. ప్రభుత్వం 200 యూనిట్ల విద్యుత్ ని ఉచితంగా అందజేస్తుందని, కాబట్టి ఎవరూ కూడా విద్యుత్ చోరికి పాల్పడకూడదని హెచ్చరించారు. అనంతరం ఏఈ మూర్త తో కలిపి గ్రామంలో ఉన్న సమస్యలను పర్యవేక్షించారు. ఎక్కడైనా విద్యుత్ సమస్యలు తలెత్తితే వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్బియి సందీప్, ఎల్ఎం అబ్జల్, ఏఎల్ఎన్ రవి, ఉప సర్పంచ్ బాలు, వార్డు మెంబర్ లు, వీడీసీ సభ్యులు, మాజీ సర్పంచ్, తాండ కారోబార్, గ్రామస్తులు పాల్గొన్నారు.

More articles

Latest article