30.2 C
Hyderabad

అర్ధరాత్రి భారీ చోరీ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఐదు తులాల బంగారం, వెండి, నగదు చోరీ

 

ఇందల్ వాయి, బతుకమ్మ :

 

ఇందల్ వాయి మండల పరిధిలోని గంగారాం తండా గ్రామంలో మంగళవారం అర్థరాత్రి భారీ చోరి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంగారాం తాండా గ్రామానికి చెందిన నసీం సుల్తానా మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో తన మనమడు కి (కూతురి కుమారుడికి) ఆరోగ్యం బాగా లేకపోవడంతో నిజామాబాద్ వెళ్ళింది. అదే రోజు అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి, బెడ్‌రూమ్ అల్మరా పగలగొట్టి అందులో గల 5 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.20000 ల నగదును చోరీ చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

More articles

Latest article