హైదరాబాద్, బతుకమ్మ : గాంధీ భవన్ లో శుక్రవారం పీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీఏసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, మంత్రులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.

