28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

గంజాయి విక్రేతను పట్టుకున్న ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్

Must read

📰 Generate e-Paper Clip

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగర శివారులోని దుబ్బ బైపాస్ రోడ్డులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. నిజామాబాద్ ఎక్సైజ్ డిసీ సోమిరెడ్డి కి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సిఐ వెంకటేష్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం  బైపాస్ రోడ్డులో గంజాయి విక్రయిస్తున్న రెంజల్ మండలం నీలా గ్రామానికి చెందిన పుల్లే లక్ష్మి నర్సింహ ను పట్టకున్నారు. అతని వద్ద నుంచి 250 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అతనిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు సిఐ వెంకటేష్ తెలిపారు. ఈ  దాడులలో  ఎస్ఐ నర్సింహచారీ, హెడ్ కానిస్టేబుళ్లు భూమన్న, రాజన్నలతో పాటు కానిస్టేబుళ్లు బోజన్న, విష్ణు, అవినాష్, సాయి కుమార్, రాం బచ్చన్ లు ఉన్నారు.

More articles

Latest article