24 C
Hyderabad
Sunday, August 2, 2026

బైక్ పై నుండి పడి ఒకరి మృతి

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ నుండి మోర్తాడ్ వైపు బైక్ పై వెళ్తుండగా తనకు తానుగా ప్రమాదవశత్తు బైక్ పై నుండి పడి గండికోట మహేష్ (42)అనే వ్యక్తి  మృతి చెందాడు. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.మోర్తాడ్ లో ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్న మహేష్ గత 15 సంవత్సరాలనుండి ఒంటరి జీవితం ను గడుపుతున్నాడు. తన భార్య తనను విడిచిపెట్టి తల్లిగారి ఇంటికి వెళ్ళిపోగా మృతుడు ఒంటరి అయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం భీమ్ గల్ నుండి మోర్తాడ్ వెళ్తుండగా భీమ్ గల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగిర్యాల శివారులో బైక్ పై నుండి పడగా తలకు తీవ్ర గాయం అయ్యింది. క్షతగాతుణ్ణి అంబులెన్సు లో చికిత్స నిమిత్తం స్థానికులు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుని అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

More articles

Latest article