. . . 32 క్రికెట్ టీమ్స్ కు డ్రా సిస్టమ్ నిర్వహణ
. . . గ్రూప్ ఏ లో 16 టీమ్స్, గ్రూప్ బి లో 16 టీమ్స్
నిజామాబాద్ స్పోర్ట్స్, బతుకమ్మ :
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ నిర్వహణ కోసం 32 క్రికెట్ టీములు దరఖాస్తు చేసుకున్నారని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. ఈ టీములను డ్రా సిస్టం ద్వారా ఏ గ్రూపు, బి గ్రూపులుగా విడదీశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శనివారం సీపీ ఆధ్వర్యంలో ఈ డ్రా సిస్టం నిర్వహించారు. గ్రూప్ ఏ లో నందిపేట్, విక్కీ XI, శివాజీ చత్రపతి, అహ్మడే పూర్, స్కేల్పేట్ స్ట్రికెర్స్, రుద్రూర్, నవిపేట్, రూరల్, గరుడ బ్లాస్టర్స్, దుబాయ్ పెర్ఫ్యూమ్స్, సందీప్, వాల్వై 11 స్టార్స్, 7వ బెటాలియన్, మోర్తాడ్ 11, వర్ని వారియర్స్, మోహన్ 11 ఉన్నాయి. గ్రూప్ బి లో ముప్కాల్, వేల్పూర్, కమ్మర్ పల్లి పిఎస్, నిజామాబాద్ మ్యాన్ పవర్, టౌన్ 1 పిఎస్, కొండాపూర్, రైసింగ్ స్టార్స్, బి.సి.సి ఇందల్ వాయి, కోటగిరి, మినార్ XI, మాక్లూర్, హ్యాపీనింగ్ XI , బోధన్, నరేష్ XI, గజానంద్ స్ట్రైకర్స్, గుండారం XI టీం లు ఉన్నాయి. ఈ క్రీడలు ఏప్రిల్ 20 నుంచి 28 వరకు నిజామాబాద్ ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నామన్నారు. ఈ డ్రా కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఎన్ఎస్ సీ చైర్మన్ సాయి చైతన్య, డీసీపీ బస్వా రెడ్డి, జనరల్ సెక్రెటరీ కవిత రెడ్డి, స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ రజనీకాంత్, హితనీ, ట్రెజరర్ సంతోష్, స్పోర్ట్స్ కు సంబందించిన పి.ఈ.టీ లు, తదితరులు పాల్గొన్నారు.
