ఇందూర్, బతుకమ్మ :
నగరంలోని నాందేవ్ వాడలోని సీపీఎం కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన శివపుత్ర యూత్ గణేష్ మండలి లడ్డూ భారీ ధర పలికింది. గత పదకొండు రోజులుగా పూజలందుకున్న గణపయ్య లడ్డును శుక్రవారం వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో రాహుల్ బాసిరి రూ.2,65,000 భారీ ధరతో లడ్డును దక్కించుకున్నారు. వినాయకుడి వద్ద పూజలందుకున్న లడ్డును దక్కించుకుంటే ఏడాది పొడవునా మంచి జరుగుతుందని అందుకే ఎక్కువ ధర అయినా లడ్డును దక్కించుకున్నట్లు రాహుల్ బాసిరి తెలిపారు. భారీ ధరతో లడ్డును దక్కించుకున్న రాహుల్ ను గణేష్ మండలి నిర్వాహకులు శాలువాతో సత్కరించి లడ్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో శివపుత్ర యూత్ నిర్వాహకులు కందికంటి నరేంద్ర గౌడ్, డాక్టర్ వంశీ, నవీన్ గౌడ్, కిరణ్ గౌడ్,బింగి శుభం, రాజేష్ ఫ్రూటీ, రింకు, అమర్, బబిత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
