22.7 C
Hyderabad

రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయాలి

 

. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఈ ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరి ద్వారా రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా  రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం, ప్రజల్లో ట్రాఫిక్ నియమాల పట్ల బాధ్యతాభావం పెంపొందించడం లక్ష్యంగా “అరైవ్ అలైవ్” కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుండి 18 వరకు జిల్లావ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ మంగళ్ పహాడ్ చౌరస్తా వద్ద ప్రజలతో, డ్రైవర్లతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం,  మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం వంటి అంశాలేనని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనం నడిపి, తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్ లో, ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని హాస్పిటల్ తరలిస్తారో, అతనికి ప్రభుత్వం నుంచి ప్రోత్సహించుట కోసం సహార్విర్ పథకం కింద ఉండేటటువంటి రూ.25 వేలు అందజేస్తామని తెలిపారు. అనంతరం ట్రాఫిక్ నిబంధనలు తెలియజేసేటటువంటి పాంప్లెంట్లు, పోస్టర్లను విడుదల చేసారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిజ్ఞ నిర్వహించారు.

 

Most people lose their lives due to road accidents.

 

ఈ కార్యక్రమంలో బోధన్ ఏ.సి.పి శ్రీనివాస్, బోధన్ రూరల్ సీ.ఐ విజయబాబు, ఎడపల్లి ఎస్సై రామ, బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి, రెంజల్ ఎస్సై చంద్రమోహన్, మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాస్, ఆర్టీసీ సిబ్బంది, ప్రజలు/ఆర్టీసీ డ్రైవర్లు/ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

 

Most people lose their lives due to road accidents.

More articles

Latest article