28.2 C
Hyderabad

బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షునిగా ఎడ్ల బాలకృష్ణ  

Edla Balakrishna appointed as BJP District SC Morcha Vice-President.

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

నిజామాబాద్ బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షునిగా ఎడ్ల బాలకృష్ణ నియమితులయ్యారు. నగరంలోని శివాజినగర్ కు చెందిన ఎడ్ల బాలకృష్ణ  మొన్నటి వరకు నిజామాబాద్ అర్బన్ ఎస్సీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ గా పని చేశారు. గతంలో నిజామాబాద్ బీజేపీ పట్టణ కార్యదర్శిగా రెండుసార్లు పని చేశారు. నిజామాబాద్ నగరంలోని ఖిల్లా మండలం కార్యదర్శిగానూ పని చేశారు. తనను ఉపాధ్యక్షునిగా నియామకానికి కృషి చేసిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పోతుల పురుషోత్తంకు ధన్యవాదాలు తెలిపారు.

. . .బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యవర్గం నియామకం

నిజామాబాద్ జిల్లా దళిత మోర్చా కార్యవర్గాన్ని నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు పోతుల పురుషోత్తం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులాచారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధికి చెందిన ఎస్సీ మోర్చా నాయకులకు జిల్లా కార్యవర్గంలో చోటు కల్పించినట్లు తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షులుగా పోగుల సాయికృష్ణ, మురళికృష్ణ, బొల్లం అరుణ్, దాయ ప్రవీణ్, ఎడ్ల బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శులుగా గుంజాల నాగభూషణ్, పులి యుగంధర్, కార్యదర్శులుగా బుడ్డ సృజన్, గొల్లపల్లి శ్రీనివాస్, అఖిలేష్ కుమార్, రాహుల్, గజ్జల శంకర్ ను నియమించారు. కోశాధికారిగా పవార్ సాయినాథ్, కార్యవర్గ సభ్యులుగా సిరికెల సతీష్, బి.సంతోష్, పల్లె మధుకర్, మల్లెపూల రాజు, సందిటి సాయిలు, అంగరి రాజలింగం, గైని శ్రీనివాస్, బాబురావు, అవినాష్, మిర్యాల శంకర్, బేగరి వినోద్, మహేంధర్ లను నియమించారు. సంబంధిత నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని జిల్లా అధ్యక్షులు పురుషోత్తం తెలిపారు.

More articles

Latest article