27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీ గా గుర్తించాలి

Must read

📰 Generate e-Paper Clip

. . . నూడా  చైర్మన్ కేశ వేణు

 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : 

 

నిజమాబాద్ నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే స్మార్ట్ సిటీ గా మార్చాలని దానికోసం పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ చొరవ తీసుకోవాలని, పార్టీలకతీతంగా పూర్తిగా సహకరిస్తామని నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్  (నూడా) చైర్మన్ కేశ వేణు అన్నారు. నిజామాబాద్ లోని ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తూ నిజామాబాద్ నగర అభివృద్ధి కమిటీ తయారు చేసిన పుస్తకాన్ని సోమవారం పెన్షనర్స్ భవనంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేశ వేణు మాట్లాడుతూ  ఒక్కపుడు నిజామాబాద్ జిల్లాకు కరీంనగర్, నాందేడ్ జిల్లాలో నుండి కొనుగోలుకు వచ్చే పరిస్థితి ఉండేదని కానీ ప్రస్తుతం ఆ రెండు జిల్లాలు నిజామాబాద్ కన్నా అభివృద్ధిలో ముందున్నాయని, నిజామాబాద్ జిల్లా వెనుక పడడానికి గత పాలకులే కారణమన్నారు. అదేవిధంగా నిజామాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు ప్రభుత్వం 400 కోట్ల విడుదల చేశాయన్నారు . నిజామాబాద్ నగరంలోని సమస్యలైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటుకు మీ సలహాలతో నూడా పరిధిలో అభివృద్ధి చేస్తామన్నారు. నగరంలో కుక్కల బెడద, ఆవుల బెడద తో పాటుగా అనేక సమస్యలను పరిష్కరించడానికి మున్సిపల్ శాఖ తో ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహిస్తామన్నారు. నగరంలో 18 నీటి ట్యాంకులను ఏర్పాటు చేసి దాహార్తిని ఆగస్టులోపు తీరుస్తామన్నారు. నిజామాబాద్ నగరానికి సంబంధించి 1974   మాస్టర్ ప్లాన్  లోని 100 ఫీట్ల రింగ్  రోడ్డు 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ రోడ్డు అవసరం లేదని ఆయన అన్నారు. ఈ సమావేశంలో నగర అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు , నాయకులు హుస్సేన్, మల్లేష్ రెడ్డి, భరద్వాజ, భూపతి రావు, ఈ.విల్. నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Nizamabad city should be recognized as a smart city

More articles

Latest article