. . . కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేసిన గ్రామస్తులు
నందిపేట్, బతుకమ్మ :
నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో ప్రత్యేకంగా ప్రాథమిక సహకార సంఘం ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్ దేవేందర్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో జరిగిన ప్రజావాణిలో గ్రామ సర్పంచ్ తో పాటు గ్రామ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ డిమాండ్ ను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ వెల్మల్ గ్రామానికి సంబంధించిన రెవెన్యూ శివారులో నాలుగు ఎకరాల 100 గజాల స్థలం ఉందని, అందులో పిఎసిఎస్ లో తమ గ్రామం నుండి 1300 వరకు సభ్యత్వం ఉందని ఆయన అన్నారు. అయితే రెండు సీజన్లు కలిపి ఒక లక్ష క్వింటాళ్ల ధాన్యాన్ని తమ గ్రామ రైతులు పండిస్తారని ఆయన తెలిపారు. అయితే తమకు చెందిన నూతన సొసైటీని నందిపేట్ లో ఏర్పాటు చేసి వెల్మల్ గ్రామాన్ని అందులో కలిపే కుట్రలు జరుగుతున్నాయని తమ గ్రామస్తుల దృష్టికి వచ్చిందన్నారు. నందిపేట్ లో తమకు చెందిన సొసైటీ ఏర్పాటుకు తాము ఎలాంటి వ్యతిరేకం కాదని కానీ మమ్మల్ని అందులో విలీనం చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. రెవెన్యూ పరంగా జిల్లాలో ధాన్యం పండించడం లో రెండో స్థానంలో తమ గ్రామం ఉందని ఆయన అన్నారు. కావున జిల్లా అధికారులు అధికార పార్టీ నేతలు తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని తమ గ్రామంలో ప్రత్యేకంగా పి ఎస్ సి ఎస్ ఏర్పాటు చేయాలని గ్రామ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించారు జరిగిందన్నారు. లేనియెడల రాబోయే ఎన్నికలను వెల్మల్ గ్రామ ప్రజలు పూర్తిగా బహిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు. కావున తమ గ్రామానికి ప్రత్యేకంగా పిఎసిఎస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇస్సాపల్లి మహేష్, మాజీ సర్పంచ్ మచ్చర్ల గంగారం, నాయకులు కస్ప రామకృష్ణ, రాము, జి ఆర్ రాజేందర్, మల్లేష్, శ్రీధర్, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
