28.1 C
Hyderabad

హవ్వా … కేసు రాసింది డిపార్ట్ మెంట్ రిపేరరా ..?

Good grief... was the case filed by the department's 'repairman' (fixer)?

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  అధికార హోదాలో ప్రైవేట్ వ్యక్తి

 

. . . ప్రేక్షక పాత్రలో సివిల్  సప్లయ్ అధికారులు 

 

. . .  “మాములు”గా తీసుకున్న తూనికల శాఖ

 

నిజామాబాద్ , బతుకమ్మ:

 

తూనికలు, కొలతలు శాఖ పని తీరు అంతంతమాత్రమే. ఇది చాలదన్నట్లుగా పరువు తీసుకునే పనులు చేస్తున్నట్లు ప్రస్పూటమవుతుంది. జిల్లా అధికారి చేయాల్సిన స్థానంలో డిపార్ట్ మెంట్ రిపేరర్ చేయడంతో శాఖ అభాసుపాలయ్యిందనే ప్రచారం అంతర్గతంగా జరుగుతోంది. ఇటివల కామారెడ్డి జిల్లా కేంద్రంలో పౌర సరఫరాల శాఖ, తూనికలు, కొలతల శాఖ సంయుక్తంగా కొన్ని బియ్యం దుఖాణాల్లో తనిఖీలు నిర్వహించారు. వాటిలో వెలుగు చూసిన తప్పిదాలపై శాఖాపరమైన చర్యల కోసం పంచనామా రాయాలి. దీనిని సర్కారు ఉద్యోగులు రాయాల్సి ఉండగా, సంస్థ తరపున ఉన్న రిపేరర్ లలో నుంచి ఒకరు… అధికారి తరహాలో పంచనామా రాయడం ఆశ్చర్యం గొలిపింది. సామాన్యులకు అందుబాటులో లేని విధంగా బియ్యం ధరలను పెంచుతూ పోతున్నారు.  దీనిని అరికట్టడానికి కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేసారు. ఇందులో భాగంగా ఈ నెల మూడవ తేదిన కామారెడ్డి జిల్లా కేంద్రంలో  బియ్యం విక్రయిస్తున్న దుకాణాలలో తనిఖీలు చేపట్టారు.

 

. . . పంచనామ రాసిన రిపేరర్

లీగల్ మెట్రాలజీ ప్యాకేజీ కమ్యూనిటీస్ రూల్స్ కింద కస్టమర్ కేర్ నెంబర్ లేదని,  తయారీదారు చిరునామా లేదని రెండు కేసులు నమోదు చేసారు.  తూనికలు, కొలతల శాఖకు సంబందించిన అధికారులు కేసు నమోదు  కోసం పంచనామా రాయాల్సి ఉంటుంది. తూనికల పనిముట్లను సరి చేసేందుకోసం లైసెన్సు తీసుకున్న వ్యక్తి పౌర సరఫరాల అధికారుల సమక్షంలో కూర్చొని కేసుకు సంబందించిన వివరాలు రాస్తుండడం చూస్తే ప్రైవేట్ రిపేరర్ కు పూర్తి  సహాయ సహకారాలు శాఖ అదికారి నుంచి ఉన్నట్లు తెలుస్తోంది.

. . . ప్రేక్షక పాత్రలో డిఎస్ఓ

తనిఖీలకు వెళ్ళిన సందర్భంలో వెంట తూనికల శాఖ అధికారులు లేరని తెలుసు. దుకాణాల్లో లీగల్ మెట్రాలజి కింద దొరికిన వాటిపై కేసులు నమోదు చేయాల్సి ఉండగా  బయటి వ్యక్తి,   డిఎస్ఓ ముందటే పంచనామా రాస్తున్నా మౌనంగా ఉండడం వెనుక ఆంతర్యం ఏమిటో అనే ప్రశ్నలు వెలువడుతున్నాయి. తనిఖీలకు వెళ్ళినప్పుడు రెండు కేసులు నమోదయ్యాయని ప్రకటన జారి చేయడంతో మరుసటి రోజు దినపత్రికలలో వార్తలు వెలువడ్డాయి.

. . .  తనిఖీలకు ఇన్స్ పెక్టరే

అధికారిక తనిఖీలకు వెళ్ళాల్సివస్తే తూనికల శాఖకు చెందిన ఇన్స్ పెక్టర్ మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ అధికారి స్థానంలో కనీసం కార్యాలయ సిబ్బంది వెళ్ళడానికి సైతం ఆస్కారం లేదు. ఇతర జిల్లాలకు ఇంచార్జ్ ఉన్నట్లయితే సమయం కుదిరింపు చేసుకొని  అధికారిక తనిఖీలకు వెళ్ళాలనే నియమ నిబంధనలు ఉన్నాయి.

. . . డిపార్ట్ మెంట్ రిపేరర్

దుకాణాలల్లో ఉన్న ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు చెడిపోతే మరమ్మతు చేయడానికి సంస్థ పరంగా లైసెన్సు తీసుకుంటారు. యంత్రాలు చెడిపోయినవి రిపేర్ కోసం రావాలని చెప్పిన .. శాఖ ఇన్స్పెక్టర్ అనుమతి తీసుకున్న తర్వాతనే దుకాణానికి తూకం యంత్రం మరమ్మతు చేయడానికి వెళ్ళాలి.

. . . భిన్నస్వరాలు

బియ్యం తనిఖీలు చేసినప్పుడు అధికార హోదాలో డిపార్ట్మెంట్ రిపేరర్ ఉండడంతో తూనికలు,కొలతల శాఖతో పాటు పౌర సరఫరాల ఉద్యోగులు సైతం నివ్వెర పోయారు. ఇప్పుడే ఇలా వస్తున్నాడంటే, అనాధికార హోదాలో చాటుమాటున ఎన్ని కార్యకలాపాలు జరుగుతున్నాయోనని సిబ్బంది చర్చించుకుంటున్నారు.

Good grief... was the case filed by the department's 'repairman' (fixer)?
 

 

More articles

Latest article