24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ సస్పెన్షన్

Must read

📰 Generate e-Paper Clip

. . . కంచె చేను మేసింది . . .

. . . ఆటవి భూముల ఆక్రమణలో మరో ఫారేస్ట్ వికేట్ ఔట్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ జిల్లా సిరికొండ ఫారెస్టు రేంజ్ పరిధిలోని పందిమడుగు సెక్షన్ ఆఫీసర్ సాయి కిరణ్  ను సస్పెండ్ చేస్తూ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు ఉత్తర్వులు జారీ చేశారు. పందిమడుగు సెక్షన్ ఆఫీసర్ గా పని చేస్తున్న సాయి కిరణ్  అటవీ భూముల ఆక్రమణ వెనుక ఉన్నారన్న ఫిర్యాదులు సీపీఎఫ్ కు అందాయి. సీసీఎఫ్ ఆదేశాల మేరకు డిస్ట్రిక్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఇంచార్జి ఆఫీసర్ విచారణ జరిపి నివేదికను అందజేశారు. విచారణ ప్రకారం సాయి కిరణ్  ను సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఆనాడు ఎఫ్ఆర్ వోతో పాటే సస్పెండ్ కావాల్సి ఉండగా . . .

నిజామాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన సిరికొండ ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ వినయ్ గతంలో బీట్ ఆఫీసర్ తో కలిసి రావుట్ల బీట్ పరిధిలోని జంగిలోడితాండ అటవీ భూముల ఆక్రమణలో సస్పెండ్ అయిన విషయం తెల్సిందే. ఆనాడు అటవీ భూముల అన్యక్రాంతంతో పాటు చెట్ల నరికివేత, కలప తరలింపు ఆరోపణలపై వినయ్ ను ఆయనతో పాటు బీట్ ఆఫీసర్ ను మరొకరిని సస్పెండ్ చేసిన విషయం తెల్సిందే. ఆనాడే పందిమడుగు సెక్షన్ లోనూ ఆరోపణలు వచ్చాయి. కానీ అధికారులు ఈ విషయాన్ని అంతగా సీరియస్ గా తీసుకోలేదు. గత కొంత కాలంగా పందిమడుగు సెక్షన్ పరిధిలో అటవీ భూముల ఆక్రమణలో ప్రమేయం ఉందని ఫిర్యాదులు అందడంతో విచారణ జరిపి చివరకు సెక్షన్ ఆఫీసర్ ను సస్పెండ చేయాల్సిన పరిస్థితి దాపురించింది. గత ఏడాది కాలంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొలుత సిరికొండ రేంజ్ ఎఫ్ఆర్ వో సస్పెండ్ కాగా తర్వాత ఎల్లారెడ్డి ఎఫ్ఆర్ వో పై వేటు పడింది. తాజాగా సెక్షన్ ఆఫీసర్ సాయి కిరణ్ ను సస్పెండ్ కావడం అది అటవీ భూముల ఆక్రమణ కేసు కావడం కంచెనే చేను మేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిజామాబాద్ నార్త్ రేంజ్ అటవీ శాఖాధికారిగా ఉన్న రాధిక పలు ఆరోపణల నేపథ్యంలోనే సుదీర్ఘ సెలవులో వెళ్లడం గమనార్హం.

 

More articles

Latest article