29.7 C
Hyderabad

కేసిఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని బిఆర్ఎస్ కార్యకర్తల పాధయాత్ర

BRS workers undertake a padayatra (foot march) seeking KCR’s return as Chief Minister

Must read

📰 Generate e-Paper Clip

… కలిసిన కార్యకర్తలకు భరోసా ఇచ్చిన కేసిఆర్

 గజ్వేల్, బతుకమ్మ:

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితేనే రాష్ట్రం బాగుపడుతుందని, వ్యవసాయ, రైతన్నల సమస్యలు తీరుతాయని ఆకాంక్షిస్తూ బిఆర్ఎస్ కార్యకర్తలు పాధయాత్ర చేశారు. నర్సాపూర్ నియోజకవర్గం లోని హత్నూర మండలం నుంచి పాదయాత్రగా వచ్చి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని ఆదివారం ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ కార్యక్రమంలో మధుర గ్రామ సర్పంచ్ నవీన్ గౌడ్, ఉదయ్ కిరణ్, రాజీవ్ గాంధీ, నర్సింహ, శ్రీకాంత్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారి ఆకాంక్షల మేరకు కష్టాలు త్వరలోనే తొలగిపోతాయని కేసీఆర్ వారికి భరోసా ఇచ్చి అభినందనలు తెలిపారు.

 

More articles

Latest article