. . . 14 ప్రాంతాల్లో దాడులు . . .14 కేసులు నమోదు
. . . 75 మంది పట్టివేత . . . రూ.1,58,508 నగదు స్వాధినం
కామారెడ్డి, బతుకమ్మ:
కామారెడ్డి జిల్లాలలో దీపావళి సందర్భంగా జరిగిన పేకాటపై పోలీసులు మెరుపుదాడులు చేశారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పోలీసు కంట్రోల్ రూంకు వచ్చిన సమాచారం మేరకు దాడులను నిర్వహించారు. ఆదివారం ఒక్కరోజే జిల్లాలోని 14 ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 14 కేసులు నమోదు చేశారు. 75 మందిని పట్టుకుని వారి వద్ద నుంచి లక్షా 58 వేల 508 నగదును స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి 63 సెల్ఫోన్లు, 18 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ జూదానికి స్వస్తి పలకండి. కష్టపడి సంపాదించిన డబ్బును జూదంలో పోగొట్టుకుని కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టుకోవద్దు. జూదం ఆడినా, నిర్వహించినా ఉపేక్షించేది లేదు. జిల్లావ్యాప్తంగా పోలీసుల 24/7 నిఘా కొనసాగుతుందని, చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఈ నెల 6న జిల్లాలో 9 ప్రాంతాల్లో దాడి చేసి 48 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1,19,740 స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5న 15 ప్రాంతాల్లో పేకాట స్థావరాలపై దాడి చేసి 65 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2,68,180 ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 4న 9 ప్రాంతాల్లో దాడి చేసి 50 మందిని అరెస్టు చేసి జిల్లా వ్యాప్తంగా 2,06,390 నగదును సీజ్ చేశారు.
